- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైరి నరేష్ వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు భైరి నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదివారం ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. నరేష్ జిల్లాకు వచ్చిన సమాచారం తెలుసుకున్న స్థానిక అయ్యప్ప స్వాములు.. వెంటనే సదస్సు జరిగే ప్రాంతానికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఇక్కడి నుంచి నరేష్ వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే నరేష్ అక్కడినుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. కొందరు అయ్యప్ప స్వాములు వాహనానికి అడ్డు తగిలారు. ఈ క్రమంలో ఒక వ్యక్తికి గాయాలు అయ్యాయి. దీంతో భైరి నరేష్‌ను అరెస్ట్ చెయ్యాలని అయ్యప్పభక్తులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఏటూరు నాగారం ఘటన నుంచి వెళ్తుండగా.. బైరి నరేష్ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. కమలాపూర్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును బైరి నరేష్ వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో స్వల్ప గాయాలతో నరేష్ బయటపడ్డాడు.