బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు

by GSrikanth |   ( Updated:2023-04-06 16:53:37.0  )
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ హన్మకొండ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్‌పై దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు అరెస్టు చేసి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాలకుర్తిలో వైద్య పరీక్షలు నిర్వహించి హన్మకొండ కోర్టులో హాజరు పర్చగా మేజిస్ట్రేట్ 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఇవాళ హన్మకొండ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు రూ.20 వేలు, ఇద్దరి పూచీకత్తుతో బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసింది. రేపు మధ్యాహ్నం ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed