- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో బడే భాయ్.. గల్లీలో చోటే భాయ్! మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కపట కాంగ్రెస్ పాలనలో కడుపు నింపే అన్నదాత ఆగమైండని, చేనేత కార్మికుడు చితికిపోతుండని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం, పాలకుడి నిర్వాకంతో ప్రతి నేతన్న నడిరోడ్డు మీద పడ్డారని ఆరోపించారు. ‘నాడు తెలంగాణ అవకాశాల గని, చేనేత కార్మికుడికి చేతినిండా పని, కానీ నేడు చేతకాని కాంగ్రెస్ పాలన.. కార్మికుల పాలిట శని’ అని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లకు అడ్రస్ లేదని, ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు మోక్షం లేదన్నారు. అసమర్థ పాలనలో దిక్కుతోచని నేతన్నలకు చేసేందుకు పనిలేదని, తినేందుకు తిండి కూడా లేదన్నారు.
బీఆర్ఎస్ తెచ్చిన.. సబ్సిడీ పథకాన్ని రాగానే సమాధి చేశారని తెలిపారు. చేనేత మిత్ర పథకానికి నిలువునా పాతరేశారని, ఇలా ఇంకెంతకాలం అన్యాయాల జాతర చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు చేనేత రంగం కుదేలైంది, గల్లీలోని చోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైందన్నారు. ‘అందుకే.. మూలనపడ్డ మగ్గం సాక్షిగా హెచ్చరిక.. చేనేత కార్మికులను చిన్నచూపు చూస్తున్న.. భస్మాసుర హస్తానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’ అని వెల్లడించారు.