beer lovers: బీరు ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ఏంటంటే..?

by Indraja |
beer lovers: బీరు ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ఏంటంటే..?
X

దిశ వెబ్ డెస్క్: వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. మండే ఈ ఎండల్లో చల్లని బీరు తాగితే బావుంటుంది అని ఆశపడే బీరు ప్రేమికులకు నిరాశే మిగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని షాపులకు సంస్థ నుండి సరఫరా అయ్యే బీర్లకి కంటే కొనుగోలు ఎక్కువగా ఉండడం ఓ కారణంగా తెలుస్తోంది.

అలానే బ్రూవరీల యనజమానులకు బేవరేజెస్ కార్పొరేషన్ సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో బీర్ల ఉత్పత్తిపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆరు బ్రూవరీల్లో రోజుకి 2.5 లక్షల కేసుల బీరును ఉత్పత్తి చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఏర్పడిన ఆర్ధికపరమైన ఇబ్బందుల నేపథ్యంలో రోజుకి కేవలం 1.5 లక్షల కేసుల బీరు మాత్రమే తయారవుతోంది. దీనితో రాష్ట్రంలో బీర్ డిమాండ్ పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed