- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉత్తమ్‌కు చేదు అనుభవం.. TRS కార్యకర్తల తీరుపై MP ఆగ్రహం..!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి హాజరైన కార్యక్రమం రసాభాసాగా మారింది. ఇరువురి నేతలు పరస్పరం విమర్శలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా నడుస్తోందని చెప్పారు.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏమి లేదని.. ఇంత వరకు రుణమాఫీ జరగలేదని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని రహదారులు, కాలువలు, ఇతర పనులు తన హయాంలోనే అందాయని అన్నారు. ఇంతలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్తమ్ ప్రసంగానికి అడ్డు తగిలారు. జై సైదిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో అసహనానికి గురైన ఉత్తమ్ తాను కూడా తన అనుచరులతో ఇంతకంటే ఎక్కువ హంగామా చేయగలనని మండిపడ్డారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేశారు.