బాబాసాహెబ్ వింటారంటూ.. ఆర్ఎస్పీ ట్వీట్

by Sathputhe Rajesh |
బాబాసాహెబ్ వింటారంటూ.. ఆర్ఎస్పీ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ముఖ్యమంత్రిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ జయంతి, సాగర తీరాన 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఇవాళ్టి దిన పత్రికల్లో ఇచ్చిన ఫుల్ జేపీ అడ్వర్టయిజ్మెంట్‌లో ఇటీవల బీఎస్పీ అడిగిన 25 ప్రశ్నలకు సీఎం సమాధానాలు దాటవేశారని ధ్వజమెత్తారు. కనీసం ఈ రోజు జరగబోయే అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ సందర్భంగా నైనా వాటికి సమాధానాలు చెబుతారని ఆశిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్ చేశారు. అలాగే గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ కథ, గ్రూప్-1 ప్రిలిమినరీ టాపర్ ఎవరో, ఆ వ్యక్తికి ఎన్ని మార్కులొచ్చాయో కూడా చెప్పడం మరువొద్దని అన్నారు. ఆ విషయాన్ని బాబాసాహెబ్ కూడా వింటారని అందువల్ల కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story