- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AYODHYA: రామ భక్తులకు శుభవార్త.. ఇక హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇక స్పెషల్ ఫ్లైట్లు
దిశ, వెబ్‌డెస్క్: రామ భక్తులకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. బోయింగ్ 737 విమానాలను ఏప్రిల్ 2 నుంచి మంగళవారం, గురువారం, శనివారాల్లో వారంలో మూడు సార్లు విమానాలను నడపనున్నట్లు స్పైస్ జెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. విమాన షెడ్యూల్‌లో SG 616 అయోధ్య నుంచి 13:25కి బయలుదేరి 15:25కి హైదరాబాద్ చేరుకుంటుంది. SG 611 హైదరాబాద్ నుంచి 10:45కి బయలుదేరి 12:45కి అయోధ్యకు చేరుకుంటుంది. అయోధ్యకు విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు నగరాల మధ్య కనెక్టివిటీని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. అదేవిధంగా ఎయిరిండియా అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్ కూడా అయోధ్యకు ప్రత్యేక విమానాలను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమచారం.