- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AYODHYA: అయోధ్య బాల రాముడి భక్తులకు బంపర్ న్యూస్.. దర్శన సమయాల్లో మార్పులు
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా రామ భక్తులంతా బాల రాముడిని దర్శించుకునేందుకు అయోధ్య తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో ఆలయ ట్రస్టు అధికారులు బాల రాముడి దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఇక ఏప్రిల్ 17 నుంచి మూడు రోజుల పాటు 24 గంటలు దర్శనం కల్పించనున్నారు. అయోధ్యలో ఆలయం నిర్మించిన తరువాత మొదటిసారిగా శ్రీరాముడి జన్మదినం సందర్భంగా ఉత్సవాన్ని నిర్విహించబోతున్నారు.
ఈ మేరకు ఏప్రిల్ 17 నుంచి 3 రోజుల పాటు సంబురాలు కొనసాగనున్నాయని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అదేవిధంగా శ్రీరామ నవమికి అధిక సంఖ్యలో అయోధ్యకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారందరికి బాలరాముడి దర్శనాలు కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. బాల రాముడికి నైవేద్య ఆరగింపు, అలంకార చేసినప్పుడే భక్తులకు దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. ప్రస్తుతం అయోధ్య బాల రాముడి దర్శనానికి ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మాత్రమే అనుమతిస్తున్నారు.