హరీష్ రావు కార్యాలయంపై దాడి.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్

by Mahesh |   ( Updated:2024-08-17 05:30:54.0  )
హరీష్ రావు కార్యాలయంపై దాడి.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. సిద్దిపేటలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై, ఇంటి పై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ సిద్దిపేట ఘటనను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆయన.. తన ట్వీట్‌లో " హరీష్‌రావు ఇంటిపై దాడి పిరికిపందల చర్య, గత పదేళ్లు రాజకీయ హింసకు తెలంగాణ దూరంగా ఉంది. కాంగ్రెస్ హయాంలో హింసను ప్రేరేపిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు.

Click Here for Twitter Link

Advertisement

Next Story

Most Viewed