దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-16 04:39:38.0  )
దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
X

దిశ, శంషాబాద్ : నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఎసీపీ భాస్కర్ గౌడ్ తెలిసిన వివరాలు ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటయ్య (40) గత కొంతకాలంగా శంషాబాద్‌లో ఫ్లైఓవర్ నిర్మాణం (వీడీపీ) ప్రైవేట్ లేబర్ కంపనీలో కార్మికునిగా పనిచేస్తూ ఉన్నాడు. లేబర్ పని చేసే వాళ్ళు కూలీలు అంతా శంషాబాద్‌లోని తహసీల్దారు కార్యాలయం ముందు గుడిసెలు వేసుకొని ఉన్నారు.

అయితే ఆదివారం రాత్రి వెంకటయ్య పీకల దాకా మద్యం సేవించి వాళ్లు నివాసం గుడిసెల పక్కలో ఉన్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి గమనించి నిందితున్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే బాలికను హైదరాబాద్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో వెంకటయ్యను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story