దారుణం.. కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

by Rajesh |   ( Updated:2024-01-17 06:35:11.0  )
దారుణం.. కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి
X

దిశ, భిక్కనూరు : తాగిన మైకంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. వావివరసలు మరిచి కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీ పేట మండలంలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి కల్లు తెచ్చుకున్నాడు. తెచ్చిన కల్లును కూతురుకు తాగించి తను తాగాడు.

భార్య ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి పొద్దు పోయాక మైనర్ బాలిక అయిన(16) కూతురుపై లైంగిక దాడికి దిగాడు. మరుసటి రోజు తన తల్లికి జరిగిన విషయాన్ని ఏడుస్తూ బాలిక చెప్పింది. దీంతో ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో తండ్రి ని చితక్కొట్టడంతో తప్పించుకొని పారిపోయాడు. తప్పించుకొని పారిపోయి వేరే గ్రామంలో తలదాచుకున్న తండ్రిని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఇంటికి పట్టుకొచ్చారు. కన్న కూతురిపై దారుణానికి పాల్పడిన తండ్రిని మంగళవారం రాత్రి కామారెడ్డి ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. డీఎస్పీ వెంట సీఐ తిరుపయ్య, ఎస్ఐ అనిల్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed