- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖాసీంపూర్‌లో ఖతర్నాక్ సినిమా.. 1200 ఎకరాల్లో మాయా ప్రపంచం!
అరచేతిలో స్వర్గం చూపుతున్నారు.. అందమైన బ్రోచర్లలో రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ పేరిట సరికొత్త ప్రపంచాన్ని ఊహాలోకంలో విహరింపజేస్తున్నారు. సాక్షాత్తూ టాటా కంపెనీ సమర్పిస్తున్నదని చెబుతున్నారు.. రీజినల్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరమంటున్నారు.. స్కూళ్లుకట్టిస్తాం.. రోడ్లు వేసేస్తాం.. అంటూ మాయా ప్రపంచంలో విహరింపజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఖాసీంపూర్‌లో ఈ ఆత్రియా సన్సార్ పేరుతో 1,200 ఎకరాల్లో అంతర్జాతీయ టౌన్ షిప్ వెలుస్తున్నది. నిజానికి ఇదంతా మాయా ప్రపంచమే..! నిబంధనల గురించి అడిగితే తమకు 20 మంది అడ్వకేట్లు ఉన్నారని దబాయిస్తుండటం కొసమెరుపు..! నిబంధనలకు ఉప్పుపాతరేస్తున్న వాళ్లకు ఎందుకంత ధీమా..!
దిశ, తెలంగాణ బ్యూరో: ఇక్కడ సూపర్ మార్కెట్లు వస్తున్నాయ్. హాస్పిటల్స్, స్కూల్స్ మేమే ఏర్పాటు చేస్తున్నాం. ఇస్కాన్ వాళ్లు టెంపుల్ కూడా కట్టేస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరమే.. పార్కులు, జాగింగ్ ట్రాక్స్.. స్పోర్ట్స్ ఎమినిటీస్.. ఒక్కటేమిటి? అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టౌన్ షిప్‌ను నిర్మించేస్తున్నాం.. అంటూ ఆకాశంలో అద్భుత దీపం వెలిగిస్తున్నారు. వాళ్లకు చట్టం లేదు. నిబంధనలు లేవు. అంతా మాయా ప్రపంచంలో కస్టమర్లను పయనింపజేస్తున్నారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టిస్తున్నారు. అక్కడేం అభివృద్ధి లేదు.. తట్టెడు మట్టి తీయలేదు. కానీ అవన్నీ వచ్చేస్తున్నాయంటూ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట ప్లాట్లను అమ్మేస్తున్నారు. రైతుల నుంచి వాళ్లు చెప్పే లెక్కల ప్రకారం భూములనే కొనుగోలు చేయలేదు. కానీ వందలాది ఎకరాల్లో ది లార్జెస్ట్ ఎవర్ ఇంట్రిగ్రేటెడ్ టౌన్ షిప్ ఇన్ తెలంగాణ 1,200 ఎకరాల్లో ఆల్ట్రా మోడరన్ లివింగ్, ఆస్పిరేషనల్ అంటూ వచ్చేస్తున్నది అంటూ ప్రచారం చేస్తున్నారు. టాటా ప్రాజెక్ట్ సమర్పిస్తున్నది. అదే మేనేజ్ చేస్తున్నది. ఇంకా ఇస్కాన్ ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్ తోనూ టై అప్ ఉన్నది. అందుకే అక్కడ ఆత్రియా సన్సార్ పేరిట 1200 ఎకరాల్లో లార్జెస్ట్ ఎవర్ ఇంట్రిగ్రేటెడ్ టౌన్ షిప్ ని తీసుకొస్తున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కమర్షియల్ ప్లాట్లు 650, 800, 1000 గజాల్లో ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్లాట్లయితే 260, 325, 650 గజాల్లో ఉన్నాయి. అన్నీ 40, 60, 120 ఫీట్ల రోడ్లే. జియో ట్యాగ్డ్ బౌండరీస్, మల్టీ హాస్పిటల్స్, పబ్లిక్ పార్కులు, స్విమ్మింగ్ ఫూల్స్, షాపింగ్ మాల్స్, యోగా సెంటర్లు.. టా ప్రాజెక్ట్స్ మేనేజ్ చేస్తున్నదని అందమైన బ్రోచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.
నో పర్మిషన్స్
ఇస్కాన్ టెంపుల్స్ వారితోనూ టై అప్ అయ్యాం. త్వరలో వాళ్లు టెంపుల్ కూడా కట్టేస్తున్నారు. ఇస్కాన్ వాళ్లు కూడా టెంపుల్ కడుతున్నారు. ఇప్పుడు 1200 ఎకరాల్లో తీసుకొస్తున్నాం. మొత్తం 3300 ఎకరాల ప్రాజెక్టు. టాటా ప్రాజెక్టుతో టై అప్ ఉందని కంపెనీ జీఎం సూర్య 'దిశ'కు వివరించారు. మరి అనుమతులు ఎందుకు తీసుకోలేదు? ప్రీ లాంచ్ కింద అమ్మొద్దు కదా? చట్టం ఒప్పుకోదు కదా? అంటే అనుమతులా? వచ్చేస్తాయి.. ఇంకా ఇరిగేషన్ నుంచి ఎన్వోసీ రాలేదు. అది రాగానే నవంబరులో ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రీ లాంచ్ కింద వంద కంపెనీలు అమ్ముతున్నాయి. మేం అమ్మితేనే వచ్చిందా నష్టం..? అంటూ సమాధానమిచ్చారు. మరి రెరా అనుమతులు లేకపోతే నష్టపోయిన వినియోగదారుడు ఎక్కడికి వెళ్లాలనడిగితే అదంతా అవసరం లేదు. మేం 100 శాతం డబ్బులు వసూలు చేయడం లేదు. మీకు సమాధానం చెప్పుకుంటూ కూర్చోలేం అంటూ మండిపడ్డారు. ఇష్టం ఉంటే కొనుగోలు చేయండి. లేదంటే వదిలేయండి. ఎవరికైనా చెప్పుకోండి. ప్రీ లాంచ్ ఆఫర్లు వద్దని చెప్పే అధికారిని తీసుకొస్తే మా ఎండీ సార్ సమాధానమిస్తారంటూ ధీమాగా చెప్పేశారు. అంతే కాకుండా తమది ట్రెండ్ సెట్టర్ కంపెనీ అని, మోసం చేసేది కాదంటూ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు.
20 మంది అడ్వకేట్లున్నారు!!
ప్రీ లాంచ్, ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మడం తప్పు కదా అంటే మా కంపెనీకి 20 మంది అడ్వకేట్లు ఉన్నారంటూ కంపెనీ సేల్స్ రిప్రెజెంటెటివ్స్ బెదిరిస్తున్నారు. వాళ్లు అన్నీ చూసుకుంటారని జీఎం సూర్య చెప్పారు. ఇప్పటికే నాలా కన్వర్షన్ చేశామన్నారు. నవంబరు 15 కల్లా అనుమతులు వచ్చేస్తాయని జోస్యం చెప్పారు. దశల వారీగా అభివృద్ధి చేస్తున్నట్లు బ్రోచర్లలో పేర్కొన్నారు. ఫస్ట్ స్టేజ్ లో ప్లాటింగ్, విశాలమైన రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, క్లబ్ హౌజ్, సెక్యూరిటీ, పార్కులు.. రెండో స్టేజ్ లో స్కూల్, సూపర్ మార్కెట్, హాస్పిటల్, బ్యాంక్, స్పోర్ట్స్ ఎమినిటీస్, జాగింగ్ ట్రాక్స్.. మూడో స్టేజ్‌లో రిటెయిల్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, మల్టీపుల్ మాల్స్, వాటర్ ఫ్రంట్, ఆశ్రమం కట్టేస్తామంటున్నారు.
అధికారుల నిరాకరణ
జహీరాబాద్మండలం ఖాసీంపూర్ తో పాటు ఈ ఆత్రియా సన్సార్ ప్రాజెక్టులు, అనుమతులు లేకుండా గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ల అంశంపై రెవెన్యూ అధికారులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. జహీరాబాద్ తహశీల్దార్ నాగేశ్వరరావును కలిసి వివరణ కోరితే ''మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్లలో బిజీ ఉంటాను. ఆ తర్వాత హజ్ భవన్, షాదీ ఖానాల స్థలం కేటాయింపు విషయంపై మాట్లాడేందుకు మైనార్టీ నాయకులను కలెక్టర్ కార్యాలయానికి తీసుకొని రమ్మన్నారు. అక్కడికి వెళ్లాలి. సంబంధిత ఫైల్స్ చూస్తే తప్ప చెప్పలేం'' అంటున్నారు. ఇంతకూ డెవలప్ చేసిన వెంచర్ లో వ్యవసాయ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయడం సరైనదేనా? అని ప్రశ్నిస్తే.. సమాధానం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు.