శివరాత్రి వేళ.. సుందరీకరణకు నోచుకోని రాజన్న ఆలయం

by Sathputhe Rajesh |
శివరాత్రి వేళ.. సుందరీకరణకు నోచుకోని రాజన్న ఆలయం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దైవ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటివరకు అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు ఆలయ పరిసరాలకు పూర్తిగా రంగులు వేయలేకపోయారు.

ఆలయ ముందు భాగంలోని ముఖ్య స్వాగత తోరణం పక్కన ఉన్నటువంటి పాత ఫ్లెక్సీలు తొలగించకపోవడం, వాటి స్థానంలో కొత్తవి అమర్చకపోవడం, గోడకు రంగులు వేయకపోవడంపై రెండు రోజుల క్రితం దిశ పత్రికలో కథనం ప్రచూరితమైన అధికారులు నిద్ర వీడటం లేదు. నేటికీ ఉత్తర గోపురానికి పూర్తిగా రంగులు వేయలేదు.

ఆలయ పరిసరాలలో కేవలం నామ మాత్రపు రంగులు వేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడు. ఆలయ తూర్పు రాజగోపురం ముందు గేటు పాడైపోయి నెలలు గడుస్తున్నా అధికారులు ఇప్పటివరకు కూడా దాన్ని సరి చేయలేదు. మరో పక్క చలువ పందిళ్ళు ఇష్టా రాజ్యాంగ వేశారు. వాటిని అధికారులు పర్యవేక్షించకపోవడం.. శానిటేషన్ పనులు ఇప్పటివరకు కొనసాగుతుండడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారుల ఆలసత్వంతో శివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న పరిసర ప్రాంతాలు సుందరీకరణకు నోచుకోలేకపోతున్నాయి..

Advertisement

Next Story

Most Viewed