మహబూబాబాద్‌లో YSRTP చీఫ్ షర్మిల అరెస్ట్

by GSrikanth |   ( Updated:2023-02-19 03:28:54.0  )
మహబూబాబాద్‌లో YSRTP చీఫ్ షర్మిల అరెస్ట్
X

దిశ‌, మ‌హ‌బూబాబాద్ టౌన్: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు ష‌ర్మిల‌ను ఆదివారం ఉద‌యం మ‌హ‌బూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ‌నివారం మ‌హ‌బూబాబాద్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌ను ఉద్దేశించి ష‌ర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ష‌ర్మిల వ్యాఖ్యల‌పై శ‌నివారం రాత్రి నుంచి ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ అనుచ‌రులు ఆగ్రహంతో ఊగిపోయారు. ష‌ర్మిల యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని పేర్కొంటూ మ‌హ‌బూబాబాద్ పోలీసులు ఆదివారం ఉద‌యం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

యాత్రకు ప‌ర్మిష‌న్ ర‌ద్దు చేసిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. ఆమెను నేరుగా హైద‌రాబాద్‌కు త‌ర‌లించ‌నున్నట్లుగా స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌పై చేసిన వ్యాఖ్యల‌తో భ‌గ్గుమ‌న్న ఆయ‌న అనుచ‌రులు ష‌ర్మిల కాన్వాయ్‌పై రాళ్ల వ‌ర్షం కురిపించారు. ఆమెను అరెస్ట్ చేస్తుండ‌గా, పోలీసుల ఎదుటే బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో ష‌ర్మిల కాన్వాయ్‌లోని ప‌లు వాహ‌నాలు దెబ్బతిన్నాయి. మొత్తంగా మ‌హ‌బూబాబాద్‌లో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది.




Advertisement

Next Story