- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Assembly: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని కారణంగా చాలా మంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుందని స్పష్టం చేశారు. రేషన్, ఆరోగ్య శ్రీ పథకాలకు వేర్వేరు కార్డులు ఇష్యూ చేయబోతున్నామని ప్రకటించారు. రేషన్ కార్డుల రేషన్ కోసం మాత్రమే ఉపయోగపడతాయని, ఆరోగ్య శ్రీ కార్డులకు రేషన్ కార్డులకు లింక్ లేదని తెలిపారు. అలాగే రేషన్ కార్డులకు, ఆరోగ్య శ్రీ కార్డులకు కొత్తగా క్రైటీరియా ఏర్పాటు చేసి వాటిని ఇవ్వబోతున్నామని.
ఈ క్రైటీరియా కోసం త్వరలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని, అందరి సలహాలు సూచనలు తీసుకొని పేదలకు మాత్రమే దక్కేలా మంత్రి ఉపసంఘంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక కేంద్రం తెలంగాణలో 54 లక్షల మందిని బీపీఎల్ కుటుంబాల కింద చూస్తుందని, మరో 35 లక్షల పైచిలుకు మందిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, తెలంగాణలో ప్రస్తుతం 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని సమాచారం ఇచ్చారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఏ ఫార్మాట్ లో దరఖాస్తులు తీసుకోవాలి అనేది క్యాబినేట్ లో నిర్ణయం తీసుకోబోతున్నామని, క్యాబినేట్ నిర్ణయించిన ఫార్మాట్ ప్రకారం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.