Assembly: నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం

by Ramesh Goud |   ( Updated:2024-08-02 12:46:49.0  )
Assembly: నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గొప్ప శుభవార్త చెప్పారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబందించిన జ్యాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని ఆనాడు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. హమీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలో ఉద్యోగార్ధులకు నోటిషికేషన్ లో జాప్యం, తరచుగా వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నా పత్రాల లీక్ అవ్వడం, వేర్వేరు పరీక్షల తేదీలు ఒకటే అవ్వడం లాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని, పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యే అభ్యర్దులకు ఈ సమస్యలు తీవ్ర నిరుత్సాహ పరిచేవని అన్నారు.

గత ప్రభుత్వ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహణ సరిగ్గా లేని కారణంగా రెండు సార్లు గ్రూప్ -1 పరీక్ష రద్దు అయ్యిందని, ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టి, నూతన చైర్మన్ నియమించడం ద్వారా ప్రక్షాళణ చేయడం జరిగిందన్నారు. అలాగే పరీక్షలను సరళీకృతం చేయడానికి యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లను సంప్రదించి, సీనియర్ ఐఏఎస్ ల ఆధ్వర్యంలో రెండు కమిటీలను ఏర్పాటు చేశామని, వారి సూచనల ఆధారంగా ప్రభుత్వం గత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్తగా 60 ఖాళీలను జత చేసి మరో నోటిఫికేషన్ జారీ చేశామని, పరీక్షను సజావుగా జరిపి ఫలితాలను కూడా ప్రకటించడంతో పాటు మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వ తేదీ వరకు షెడ్యూల్ చేశామని తెలిపారు. అలాగే హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షలను కూడా సజావుగా జరిపామని అన్నారు. వివిధ శాఖల్లో 32,400 మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయడంతో పాటు, 13,500 పోస్టులకు అనుమతులు కూడా మంజూరు చేశామని తెలిపారు. ఇక 11,062 ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వగా.. వాటికి పరీక్షలు కొనసాగుతున్నాయని, వీటితో పాటు 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని అన్నారు.

ఇక పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా అభ్యర్ధుల కోరిక మేరకు గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అనేక రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావల్సిన సమయం లేకపోవడం వలన దరఖాస్తుదారులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, అట్టి సమస్యలను నివారించడానికి యూపీఎస్సీ మాదిరిగా ప్రిపరేషన్ కు సమయం ఇచ్చేలా పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ రూపొందించి, ఆగస్ట్ 1 నాడు జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం జరుగుతుందన్నారు. దీనికి సంబందించిన పత్రులను సభలోని సభ్యులకు అందించడం జరిగిందని తెలిపారు. ఇక దీనిపై సభ్యులు మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ లో తేదీలు మాత్రమే ప్రకటించారని, ఖాళీల విషయంపై స్పష్టతనివ్వలేదని అన్నారు. దీనిపై భట్టి స్పందిస్తూ.. జాబ్ క్యాలెండర్ లో కేవలం తేదీలు మాత్రమే ప్రకటించబడతాయని, ఖాళీలకు సంబందించి సమాచారం నోటిఫికేషన్ లో మాత్రమే తెలియజేస్తామని వివరణ ఇచ్చారు.


Advertisement

Next Story