- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి ముఖ్య అతిథిగా అసోం సీఎం
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో నిర్వహించే గణేశ్ నిమజ్జనోత్సవానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరుకానున్నారు. ఈ శోభాయాత్రలో ఆయన కూడా పొల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ఆయన శుక్రవారం విశ్వహిందు పరిషత్, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఈశాన్య రాష్ట్రాల్లో సంఘ పరివార క్షేత్రాల్లో పనిచేసి వచ్చిన పలువురితో ఆయన బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ శ్యాం బాబా దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని హిమంత బిశ్వ శర్మ దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ట్యాంక్ బండ్ కు ఆయన చేరుకుంటారు. కాసేపు అక్కడే ఉండి గణేష్ నిమజ్జనాలను పర్యవేక్షించనున్నారు.
రేపు రాష్ట్రానికి సునీల్ బన్సల్..
రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ ఈనెల 10వ తేదీన తెలంగాణకు రానున్నారు. ఆ రోజు హైదరాబాద్ లో పలువురు ముఖ్య నేతలతో ఆయన భేటీ నిర్వహించనున్నారు. మరుసటి రోజు ఉదయం ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి మునుగోడు కు వెళ్లనున్నారు. అక్కడి పరిస్థితుల పై ఆరా తీయనున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎలాంటి వ్యూహాలు రచించాలి. మునుగోడులో బీజేపీ ఎంతమేరకు పుంజుకుందనే అంశాలపై బన్సల్ చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి ఇన్ చార్జిగా నియామకమైన అనంతరం రెండోసారి ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. రెండో పర్యటనలోనే ఆయన మునుగోడు కు వెళ్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : HYD: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వస్తే చిక్కినట్లే!