- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM రేవంత్ ఐదేళ్లు పని చేసుకోవచ్చు: MP అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చాలా మొండి ఘటమని.. పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. శుక్రవారం ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పట్టుదల గల నేత అని.. ఆ పట్టుదలతోనే ఈ స్థాయికి చేరారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని.. రేవంత్ రెడ్డి ఐదేళ్లు ప్రశాంతంగా పని చేసుకోవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర అభివృద్ధిలో సీఎం రేవంత్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారని, కానీ కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులను అడ్డుకోవాలని అన్నారు. సీఎంను కలవగానే పాతబస్తీ అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేశారని.. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్‌కు నిధులు మంజూరు చేసిన రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఒవైసీ ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరారు. చంచల్ గూడ జైలును ఓల్డ్ సిటీ నుండి తరలించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.