- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పార్టీలో వస్తే టికెట్ ఇస్తాం.. కాంగ్రెస్ నేతలకు ఓవైసీ ఓపెన్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయాల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు. బీఆర్ఎస్‌లో సీటు దక్కని నేతలు కాంగ్రెస్‌లో చేరుతుండగా.. హస్తం పార్టీలో సీటు ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తోన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలకు ఓవైసీ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్‌లో సీటు దక్కని నేతలు ఎంఐఎం పార్టీలో చేరవచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
మజ్లిస్ పార్టీలో చేరితే టికెట్ ఇస్తామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ నేతలకు ఓవైసీ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ సీటుపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఇటీవల తొలి జాబితాలో చోటు దక్కలేదు. దీంతో అసంతృప్తితో గాంధీ భవన్ ముందు ధర్నాలు చేయడంతో పాటు పార్టీకి రాజీనామా చేస్తోన్నారు. కొంతమందికి బీఆర్ఎస్ నుంచి ఆఫర్లు రావడంతో ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. దీంతో ఎంఐఎంలో చేరాలని ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అని, తమ పార్టీ ఎవరికీ బీ టీం కాదని ఓవైసీ తెలిపారు.