Arvind Dharmapuri: అలాంటి వ్యక్తే బీజేపీ అధ్యక్షుడిగా కావాలి.. ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్..

by Prasad Jukanti |
Arvind Dharmapuri: అలాంటి వ్యక్తే బీజేపీ అధ్యక్షుడిగా కావాలి.. ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. ట్రిబుల్ కే (కేసీఆర్, కేటీఆర్, కవిత) సచ్చినా వారిని బీజేపీ దగ్గరికి కూడా రానివ్వమన్నారు. వీరికి జీవితాతం బీజేపీతో ఎటుంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. మిగతా వారు ఎటు వెళ్తారో మాకు సంబంధం లేదన్నారు. శుక్రవారం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. ప్రస్తుతం రాజకీయాల్లో ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్నారని ఓ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం అవుతుంటే బయట మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అని ప్రచారం జరుగుతున్నదన్నారు. గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం అయినట్లేలెక్క అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారమని గుర్తు చేశారు. బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారన్నారు. ఎవరైతే పార్టీని ఎన్నికల్లో గెలిపించగలరో అలాంటి వ్యక్తిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలన్నారు.

కేసీఆర్ ఓ దొంగ:

బీజేపీ తలపెట్టిన ఆగస్టు 24 రైతు దీక్షకు తన తరపున సంపూర్ణ మద్దతు ఉందని ఈ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని ఈ విషయాన్ని తాము గతంలోనే చెప్పామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 30 శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అని సెటైర్ వేశారు. కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెలదీస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ దొంగ, దగుల్బాజీ అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకత్వం చేసిన మోసం అంతా ఇంతా కాదన్నారు. ప్రజలు మళ్లీ మళ్లీ మోసపోవద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో గతంలో గుజరాత్ సీఎంగా ఉండగా మోడీ రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారన్నారు.

Advertisement

Next Story

Most Viewed