- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్‌లు 100 దాటుతాయ్: CP సీవీ ఆనంద్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య వంద దాటవచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ చెప్పారు. ఈ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. కొందరు అభ్యర్థులు ఎలక్ర్టానిక్ డివైస్‌లను ఉపయోగించుకుని పరీక్షలు రాసినట్టుగా దర్యాప్తులో తేలిందన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుకు సంబంధించి ఇప్పటివరకు వేర్వేరు పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వందమందికి పైగా అభ్యర్థులను విచారించినట్టు చెప్పారు. బోర్డులోని కాన్ఫిడెన్షియల్ రూం నుంచి ఈ ప్రశ్నాపత్రాలను లీక్‌చేసిన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిల చేతుల్లో నుంచి వేర్వేరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. డబ్బు పెట్టి ప్రశ్నాపత్రాలు కొన్నవారు తాము చెల్లించిన నగదును తిరిగి సంపాదించుకునేందుకు మరింత మందికి ప్రశ్నాపత్రాలను అమ్మినట్టుగా తెలిపారు. ఈ కేసులో పాత్ర ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని చెప్పారు.