బీఆర్ఎస్, బీజేపీ నాయకుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన

by M.Rajitha |
బీఆర్ఎస్, బీజేపీ నాయకుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి వెళ్ళిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేత బండి సంజయ్, ఆయన కార్యకర్తలు గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి సచివాలయ ముట్టడికి ప్రయత్నం చేయగా.. బండిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను తీసుకువెళ్ళి నాంపల్లి బీజేపీ ఆఫీసులో వదిలి పెట్టారు. ఆయనతోపాటు అరెస్టయిన పలువురు బీజేపీ నేతలను మాత్రం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించగా.. స్టేషన్ బయట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇదే ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ ను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించగా.. శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బండ్లగూడ పీఎస్ కు తరలించారు. సైఫాబాద్ స్టేషన్ కు పోలీసులు తాళం వేయగా.. బీఆర్ఎస్ శ్రేణులు స్టేషన్ బయట భారీ ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Next Story