- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arogya Sri: అప్లయ్ చేసిన ఆస్పత్రులన్నింటికీ ఆరోగ్య శ్రీ పర్మిషన్!
దిశ, తెలంగాణ బ్యూరో: అప్లయ్ చేసిన ఆస్పత్రులన్నింటికీ ఆరోగ్య శ్రీ పర్మిషన్ ఇచ్చేలా ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లకు అడ్మిషన్ ప్రాసెస్ సులభతరం అవుతుందని, పేషెంట్లకూ సమయం ఆదా అవుతుందని భావిస్తున్నది. ఈ అంశంపై ఇటీవల హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. అధికారులు, నెట్ వర్క్స్ ఆస్పత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆరోగ్య శ్రీ ఎంప్యానల్ హాస్పిటళ్ల సంఖ్యను పెంచాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మినిమం 50 బెడ్స్ కలిగి ప్రభుత్వానికి అప్లయ్ చేసిన ఆస్పత్రులకు ఎంప్యానల్ చేయాలని నిర్ణయించారు. దీని వలన ప్రస్తుతం ఉన్న ఆరోగ్య శ్రీ ఎం ప్యానల్ ఆస్పత్రులకు అదనంగా సుమారు 150 ఆస్పత్రులు పెరగనున్నాయని వైద్యాధికారుల్లో ఒకరు తెలిపారు.
రూల్స్ సవరింపు!
ప్రస్తుతం ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్ కావాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయి. దాదాపు 13 నుంచి 15 రకాల నిబంధనలను పాటించాల్సి వస్తున్నది. ఎక్కడైనా చిన్న లోపం కనిపించినా, సదరు అప్లికేషన్ ను రిజెక్ట్ చేస్తున్నారు. రీ మార్క్స్ ను సవరించుకునే వెసులుబాటు కూడా ఇవ్వడం లేదని నెట్ వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. దీంతో ఇప్పుడున్న నిబంధనల్లో కొన్ని తొలగించి, పర్మిషన్లు ఈజీగా మార్చనున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారం రూల్స్ పాటిస్తూనే, స్టాఫ్, సౌలత్ లు, బెడ్ల ఆధారంగా అప్రూవల్స్ ఇవ్వనున్నారు. ఇక ఆరోగ్య శ్రీలో మరి కొన్ని స్పెషాలిటీ సేవలను కూడా కలపాలని సర్కార్ ఆలోచిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ త్వరలో అధ్యయనం చేయనున్నది.
ఫుల్ పబ్లిసిటీ
కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. అయితే ఇప్పటికీ చాలా మందికి ఈ విషయంపై స్పష్టత లేదు. దీంతో ఎం ప్యానల్ పొందిన ఆస్పత్రుల చుట్టూ భారీగా బోర్డులు, హోర్డింగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీని వలన ప్రజల్లో ఈ పథకంపై మరింత ఆదరణ పెరుగుతుందని, తద్వారా సర్కార్ కు మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ పథకంతోనే అత్యధిక మంది పబ్లిక్ కు దగ్గర కావొచ్చని కాంగ్రెస్ ఆలోచన. పదేళ్ల ప్రభుత్వ టార్గెట్ కు ఇది బాగా కలిసి వస్తుందని ఇటీవల కేబినెట్ లోనూ చర్చించినట్లు సమాచారం. దీంతోనే ఎంప్యానల్ ఆస్పత్రులను భారీగా పెంచనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 374 ఎంప్యానెల్ ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఇవి జనాభా సంఖ్య పరంగా లేవని ఉన్నతాధికారులు చెప్తున్నారు. పక్క స్టేట్ ఏపీలో దాదాపు 800 లకు పైగా ఉన్నాయి. దీంతో మన దగ్గర కూడా ఆస్పత్రుల సంఖ్యను పెంచితే దాదాపు రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు మరింత వేగంగా అందుతాయని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతోపాటు పేషెంట్ కు సమీపంలోనూ వైద్యం అందుతుంది. రోగికి కూడా ఆప్ఏషన్ ఎంచుకొని చికిత్స నిర్వహించుకునే వెలుసుబాటు కలగనున్నది.