మోడీ నాయకత్వం లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వీడియో వైరల్

by Ramesh N |   ( Updated:2024-03-06 15:41:51.0  )
మోడీ నాయకత్వం లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా, ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణం తొలగిపోవాలా.. చైనాతో దేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గాలంటే మరోసారి మోడీ రావాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తాజాగా ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేడు ప్రధాని మోడీ నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం ఉందన్నారు. లేకపోతే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని, మూడు ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

దీంతో ఆయన కామెంట్స్ నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మణిపూర్‌లో గొడవ ఆపలేదు.. కానీ ప్రపంచ యుద్ధాలు అపుతారంట అని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed