Arekapudi Gandhi: ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుండు: ఎమ్మెల్యే అరెకపూడి ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-09-13 04:37:37.0  )
Arekapudi Gandhi: ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుండు: ఎమ్మెల్యే అరెకపూడి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన నేతగా తనకు మంచి పేరు ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తనకు ఎలాంటి యుద్ధం జరగడం లేదని, కౌశిక్‌రెడ్డి అనే చీటర్, బ్రోకర్‌తో తాను ఫైట్ చేస్తున్నానని తెలిపారు. రెడ్డగొట్టడం వల్లే చిల్లరగాడితో పోట్లాడుతున్నానని క్లారిటీ ఇచ్చారు.

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. కౌశిక్‌రెడ్డి ఆంధ్రా, తెలంగాణ పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ గుండాలతో తనపై పూలకుండీలు, రాళ్లతో దాడి చేయించాడని ఆరోపించారు. అప్పటికే ఫుల్ సెక్యూరిటీ మధ్య ఉన్న కౌశిక్‌రెడ్డిపై తాము ఎలా దాడి చేయగలమో చెప్పాలన్నారు. ఇదే కౌశిక్‌రెడ్డి ఎంతో మందిని మోసం చేశాడని, అతడి మాటలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా స్పందించాలంటూ అరెకపూడి గాంధీ అన్నారు.

Advertisement

Next Story