- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధికారంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేస్తూనే అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడే అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. పార్టీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల చేత తరచూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లో బీజేపీపై నమ్మకం కలిగించే ప్రయత్నాలు స్పీడప్ చేసింది. తాజాగా పార్టీ కార్యాలయంలో కీలక మార్పుకు శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ అయింది. సీఎం కేసీఆర్ సర్కార్ ను గద్దెదించి బీజేపీ అధికారంలోకి రావడం కోసం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు చేపట్టింది. కొన్నాళ్ల క్రితం మూసివేసిన కార్యాలయం ప్రధాన దర్వాజాను పూర్తిగా తొలగించి అక్కడ కొత్త మెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆఫీస్ లోకి వెళ్లేందుకు ఉన్న ప్రధాన ద్వారం కొంత కాలంగా మూసివేసి ఉంచారు. దాంతో లోపలికి వెళ్లెందుకు ప్రత్యామ్నాయంగా ఐరన్ మెట్లు ఏర్పాటు చేసి సైడ్ డోర్ ను నేతలు ఉపయోగించారు. ఈ క్రమంలో మూసివేసిన ప్రధాన దర్వాజాను పూర్తిగా తొలగించి దాని స్థానంలో కొత్త మెట్లను పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. వాస్తు నిపుణల సలహాలు సూచనల మేరకు ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే క్రమంలో గాంధీ భవన్ లోనూ వాస్తు ప్రకారం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాస్తుకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అందరికి తెలిసిందే. పార్టీల మధ్య వాస్తు నమ్మకం ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి మరి.