- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్‌ను నియమించింది. ఈ మేరకు ముగ్గురు నేతలకు కేబినెట్ ర్యాంక్ కేటాయిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్, పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ సలహదారుగా షబ్బీర్ అలీని నియమించారు. అంతేకాదు.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా శ్రమించి నిరాశ చెందారు. అప్పటి నుంచి కాస్త నిరుత్సాహంలో ఉన్న ఆయనకు అధిష్టానం భరోసా ఇస్తూ వచ్చింది. మరోవైపు కామారెడ్డిలో తీవ్ర పోటీ ఉండటంతో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీకి కూడా పార్టీ కీలక బాధ్యతలు ఇవ్వబోందని వార్తలు వచ్చాయి. వీరిద్దరితో పాటు హర్కర వేణుగోపాల్ కూడా సంతృప్తి చెందేలా తాజాగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించింది.