- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Tummala : ఆదర్శ రైతులను నియమించండి : మంత్రి తుమ్మలకు కోదండ రెడ్డి వినతి
దిశ, వెబ్ డెస్క్ : మళ్ళీ తెరపైకి ఆదర్శ రైతుల వ్యవస్థ తెరపైకి వచ్చింది. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా ఆదర్శరైతుల నియమాకాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి(Kodanda Reddy) వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao)ను కలిసి విజప్తి చేశారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007లో ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన, సాగులో అనుభవజ్ఞులైన రైతులను ఆదర్శ రైతులుగా నియమించారు. ప్రతి 250మంది రైతులకు ఒక ఆదర్శ రైతును నియమించారు. వారికి రూ.1000గౌరవ వేతనం ఇచ్చేవారు. అదికూడా వారికి కొన్ని నెలలకొకసారి విడుదలయ్యేది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది. ఒకేసారి 16,841మంది ఆదర్శ రైతులను 2014సెప్టెంబర్ లో కేసీఆర్ ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో వ్యవసాయ విస్తరణ అధికారులతో రైతులకు అవసరమైన సేవలందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి ఆదర్శ రైతుల నియామక డిమాండ్ ఊపందుకుంటుంది.