BC విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ‘విదేశీ విద్య’ పథకానికి అప్లికేషన్స్ స్టార్ట్

by Satheesh |
BC విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ‘విదేశీ విద్య’ పథకానికి అప్లికేషన్స్ స్టార్ట్
X

దిశ ,తెలంగాణ బ్యూరో: మహాత్మా జ్యోతిబాపూలె బీసీ 'విదేశీ విద్య' పథకానికి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాలమాయాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ చేసేందుకు ఈ పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ నెల 5వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు వయస్సు ఈ ఏడాది జులై ఒకటవ తేదీ నాటికీ 35 సంవత్సరాలు వయస్సు ఉండాలని తెలిపారు. అలాగే సంవత్సర ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉండరాదని పేర్కొన్నారు. విదేశీ విద్య పథకానికి అప్లై చేసే అభ్యర్థులు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. ఇతర వివరాలకు, ఆన్ లైన్ అప్లికేషన్లకు http://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story