కాసానిని కలిసిన ఏపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా భేటీ..!

by Satheesh |   ( Updated:2023-10-18 14:50:00.0  )
కాసానిని కలిసిన ఏపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా భేటీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో బుధవారం ఏపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల తరుణంలో ఇరువురి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులను చర్చించారు. పొత్తులతో పార్టీకి కలిగే లాభనష్టాలను సైతం చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు తదనంతరం పరిణామాలపైనా చర్చించారు. భవిష్యత్‌లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. జనసేనతో పొత్తు ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందని, ఎలా ముందుకు సాగితే విజయం చేకూరుతుందనే అంశాలను సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

అనంతరం కాసానికి ఎమ్మెల్యే ఉండవల్లి తిరుమల వెంకటేశ్వరుడి పద్మావతి చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మేకల భిక్షపతి ముదిరాజ్, కాసాని సాయి తదితరులు పాల్గొన్నారు. అలయ్.. బలయ్ కార్యక్రమానికి రావాలని కాసానికి ఆహ్వాన లేఖను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి అందజేశారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని విజయలక్ష్మి కోరారు.

Advertisement

Next Story