హరీష్ రావుపై మరోసారి ఏపీ మంత్రి ఫైర్

by Sathputhe Rajesh |
హరీష్ రావుపై మరోసారి ఏపీ మంత్రి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హారీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఏపీ గురించి తెలుసుకుని మంత్రి హరీశ్ రావు మాట్లాడితే బాగుంటుందన్నారు. హైదరాబాద్‌లో గంట వర్షం కురిస్తే మునిగిపోతుందన్నారు. పరిశ్రమలు, ఆదాయమంతా హైదారాబాద్ లో వదిలిపెట్టి వచ్చేశామన్నారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను వదిలి వస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు.

మీ గ్రామాల్లో రోడ్ల సంగతి ఎలా ఉందో ఒక సారి చూసుకోండి అన్నారు. పాలనలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ప్రతి రోజు ప్రతిపక్షాలు చెబుతున్నాయన్నారు. రాష్ట్రానికి వచ్చి తిరిగితే జగన్ పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. దగుల్బాజీ మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. అయితే నిన్న సంగారెడ్డి జిల్లా అందోలు మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఏపీలో పాలనపై మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం లేదంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story