Chiranjeevi ‘Bhola Shankar’ మూవీకి ఏపీ సర్కారు బిగ్ షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-10 04:59:33.0  )
Chiranjeevi ‘Bhola Shankar’ మూవీకి ఏపీ సర్కారు బిగ్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ హీరోగా, మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఏపీలో భోళా శంకర్ టికెట్ల పెంపుపై ఉత్కంఠ నెలకొంది. సినిమా యూనిట్ ఏపీలో టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. చిత్ర నిర్మాణ వ్యయంపై డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏపీ సర్కారు ‘భోళా శంకర్’ చిత్ర యూనిట్‌ను కోరింది. పత్రాలు సమర్పిస్తే రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది.

సినిమా బడ్జెట్ రూ.100 కోట్లు దాటితేనే రేట్లు పెంచేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. రెమ్యూనరేషన్ కాకుండా రూ.101 కోట్లు ఖర్చు చేశామని చిత్ర యూనిట్ తెలిపింది. అనుమతికి కావాల్సిన 11 డాక్యుమెంట్లు లేవని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమా టికెట్ల విషయంలో పారదర్శకంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సినిమా రంగంపై ఎలాంటి వివక్ష లేదన్నారు.

Also Read: ‘Bhola Shankar’‌ వివాదం.. మరో బిగ్ ట్విస్ట్!

Advertisement

Next Story