తెలంగాణ క్యాబ్ డ్రైవర్లపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

by Bhoopathi Nagaiah |
తెలంగాణ క్యాబ్ డ్రైవర్లపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ క్యాబ్ డ్రైవర్లపై ఏపీ డిప్యూటీ సీఎం, మెగా హీరో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వేదికగా నడుస్తోన్న క్యాబ్ డ్రైవర్లు మానవత్వం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్-2తో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన క్యాబ్‌లను హైదరాబాద్‌లో నడపవద్దని కొందరు అభ్యంతరం తెలిపినట్లు ఆ రాష్ట్రానికి చెందిన క్యాబ్ డ్రైవర్లు పవన్ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రభుత్వానికి, క్యాబ్ డ్రైవర్లకు కీలక విజ్ఞప్తి చేశారు.

ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కాగానే ఇక్కడి ఉపాధి దొరుకుతుందని, అప్పుడు ఇక్కడే క్యాబ్‌లు నడిపించుకుంటారన్నారు. ప్రస్తుతం ఏపీ క్యాబ్‌లు నేషనల్ పర్మిట్లు కలిగి ఉన్నాయని.. ఇది చూసైనా తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు మానవత్వంతో ఆలోచించి సహకరించాలని కోరారు. ఏపీకి చెందిన 2 వేల మంది హైదరాబాద్‌లో క్యాబ్‌లు నడుపుకుంటున్నారని, వారంతా రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన క్యాబ్ డ్రైవర్లకు భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story