- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్గదర్శి కేసులో శైలజను విచారిస్తున్న ఏపీ సీఐడి
by Hamsa |
X
దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రెండవ నిందితురాలిగా ఉన్న శైలజను ఆంధ్రప్రదేశ్ సీఐడి అధికారులు సోమవారం విచారించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36 లోని శైలజ నివాసానికి ఉదయమే చేరుకున్న అధికారులు కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ప్రధానంగా చిట్ ఫండ్స్ నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలపై శైలజ వివరణ తీసుకున్నట్లు తెలిసింది. దాంతోపాటు చందాదారులకు ఎన్ని కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు అన్న దానిపై ఆరా తీసినట్టు సమాచారం. చందాదారులకు ఇవ్వాల్సిన చిట్టి డబ్బులు ఇవ్వకుండా ఏ మేర డిపాజిట్లు సేకరించారు, ఏయే ఇతర సంస్థల్లో ఈ డబ్బును పెట్టుబడులుగా పెట్టారు, చేసిన చెల్లింపులకు సంబంధించి టీడీఎస్ కట్టారా, లేదా అన్న వివరాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. 30 మంది అధికారుల బృందంలో ఉన్న మహిళా ఆఫీసర్లు శైలజను ప్రశ్నించారు.
Advertisement
Next Story