తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వండి.. క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-14 12:00:33.0  )
తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వండి.. క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేడర్ ఐఏఎస్‌(AP Cadre IAS)లు క్యాట్‌(Central Administrative Tribunal)ను ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు. వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజనలు పిటిషన్లు దాఖలు చేశారు. డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణలోనే కొనసాగేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి కోరగా.. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సృజన కోరారు. నలుగురు ఐఏఎస్‌లు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రేపు ఈ పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ విచారణ చేపట్టనున్నది. అంతకుముందు రాష్ట్ర సచివాలయం వేదికగా సీఎస్ శాంతికుమారితో నలుగురు ఐఏఎస్‌లు భేటీ అయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం క్యాట్‌ను ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed