వాష్‌రూమ్‌ల వద్ద వెకిలి చేష్టలు.. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌పై కంప్లైంట్

by Sathputhe Rajesh |
వాష్‌రూమ్‌ల వద్ద వెకిలి చేష్టలు.. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌పై కంప్లైంట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఈవ్ టీజింగ్ చేస్తూ తమను సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారని వారి నుంచి కాపాడాలని ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజును కలిసి డిచ్ పల్లి మండలం నడిపల్లి వద్ద గల తిరుమల ఫార్మసీ కళాశాలలో విద్యార్థినుల పట్ల సీనియర్ విద్యార్థుల వేధింపులను ఏకరువు పెట్టారు. తిరుమల కళాశాలలో చదువుతున్న తమను ఫార్మసీ నాలుగో సంవత్సరం విద్యార్థులు వేధిస్తున్నారని వాపోయారు. ముఖ్యంగా వాష్‌రూమ్‌ల వద్ద తమతో వేకిలి చేష్టలు చేస్తూ, అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారని వాపోయారు.

ఈ విషయంలో కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపారు. బాలికలు అయితే చాలు అన్నట్టు వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలిచిన తోటి విద్యార్థులపై సీనియర్లు దాడి చేసి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కళాశాలలో జరుగుతున్న వేధింపులు పక్కదోవ పట్టించేందుకే ర్యాగింగ్ జరగలేదని వేధించడం లేదని చెబుతున్నారని సీపీకి విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ కేఆర్ నాగరాజు విద్యార్థినులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed