- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేపర్ లీకేజీలో మరో ట్విస్ట్.. తవ్విన కొద్ది వెలగులోకి కొత్తవిషయాలు
దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన బోర్డు ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి ప్రశ్నపత్రాన్ని తీసుకున్నట్టుగా సిట్ విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ప్రశ్నించినప్పుడు ఈ విషయం వెలుగు చూసినట్లు సమాచారం.
సహోద్యోగులు అని తాము షమీమ్, రమేష్ లకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం ఇవ్వలేదని చెప్పిన వీళ్లు తాము ప్రశ్నపత్రాన్ని తస్కరించిన విషయం ఆ ఇద్దరికీ తెలిసి పోయినట్టు చెప్పారని తెలిసింది. ప్రశ్నపత్రం చోరీ చేసిన విషయం చెప్పేస్తామని బ్లాక్ మెయిల్ చెయ్యటంతోనే షమీమ్, రాజశేఖర్ రెడ్డి కి ప్రశ్నపత్రం ఇచ్చామని వివరించినట్లు సమాచారం. రమేష్ నుంచి బోర్డు మాజీ ఉద్యోగి సురేష్ కు ప్రశ్నపత్రం అందిందని చెప్పినట్టు తెలిసింది.
కస్టడీలోకి...
కోర్టు అనుమతి ఇవ్వడంతో బుధవారం ఉదయం సిట్ అధికారులు షమీమ్, రమేష్, సురేష్‌లను చెంచల్ గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. కోఠి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించి సిట్ కార్యాలయానికి తరలించారు.