ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. 40 మంది మహిళలకు లైంగికంగా వేధింపులు

by Anjali |
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. 40 మంది మహిళలకు లైంగికంగా వేధింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని ఓ గెస్ట్ హౌజ్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనేక అంశాలు చర్చకు వచ్చాయని తేలడంతో పోలీసులు ఆ గెస్ట్ హౌజ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేసులో కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు ట్యాపింగ్‌ను అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో పోలీసులు నలుగురు కానిస్టేబుల్స్‌ను అదుపులోకి తీసుకున్నారట. అలాగే పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ ఫోన్ ట్యాపింగ్‌తో ఒక్కరూ కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగావేధించారట. విచారణతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొందరి డేటా సేకరించి వ్యక్తిగత జీవితాలను కూడా సదరు కానిస్టేబుళ్లు టార్గెట్ చేశారట. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్‌లు ఏర్పాటు చేశారట. మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి ఓ కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడ్డాడని సమాచారం. స్థానిక రౌడీ షీటర్లతో చేతులు కలిపి ఓ పోలీస్ అధికారి సాయంతో ఈ తతంగం నడిపించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed