సమ్మక్క-సారలమ్మకు మరో అరుదైన గౌరవం.. ఆ జిల్లాకు వనదేవతల పేర్లు

by Rajesh |
సమ్మక్క-సారలమ్మకు మరో అరుదైన గౌరవం.. ఆ జిల్లాకు వనదేవతల పేర్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కుంభమేళా జాతరగా మేడారంనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క-సారలమ్మ ప్రసిద్ధి గాంచింది. ఈ జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం వస్తారు. కాగా, సమ్మక్క-సారలమ్మకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ములుగు జిల్లా పేరు మార్చుతూ పబ్లిక్ నోటీసు జారీ చేశారు. సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా మార్చుతూ నోటీసు జారీ చేశారు. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించనున్నారు. అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed