- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ మరో కొత్త పాట రిలీజ్.. గులాబీలా జెండలే రామక్కకు మించిన సాంగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘గులాబీల జెండాలే రామక్క’ బీఆర్ఎస్ పార్టీ పాట అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆ పాటకు సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య జనం వరకు అందరూ స్టెప్పులు వేశారు. ఈ క్రమంలోనే జరగబోయే లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ మరో కొత్త పాటను రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రూపొందించిన ఈ పాటను తాజాగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆధ్వర్యంలో పాటను రూపొందించారు.
ఈ పాటకు సంబంధించిన వీడియోలు బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాయి. ‘పోరాటమన్నది కొత్తకాదే ఓ తల్లి లచ్చుమమ్మ.. బాపు ఆరాట పడకుంటె రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ! గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ.. వెనుకడుగు వేయక ముందరుంటా నా తల్లీ లచ్చుమమ్మ!’ అనే చరణాలతో పాట మొదలవుతుంది. ఈ పాటలో కేసీఆర్ ఉద్యమ సమయంలో పోరాటం చేసిన దృశ్యాలు గుర్తుచేశారు. మరోవైపు నేడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, నీళ్ల సమస్య, ఎండిన పంట పొలాలు, కేసీఆర్ స్పీచ్‌లు ఈ పాటలో వీడియో రూపంలో పెట్టారు.