బిగ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ‘‘లొల్లి’’.. కొత్త వాదన తెరపైకి తెచ్చిన SC, బీసీ లీడర్స్!

by Satheesh |   ( Updated:2023-03-10 00:30:38.0  )
బిగ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ‘‘లొల్లి’’.. కొత్త వాదన తెరపైకి తెచ్చిన SC, బీసీ లీడర్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో క్రమ శిక్షణ లొల్లి కొనసాగుతున్నది. కేవలం బీసీ, ఎస్సీ నేతలపైనే చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇతరులు పార్టీ లైన్​క్రాస్ ​చేసినా.. విమర్శించినా ఎలాంటి యాక్షన్ ​తీసుకోవడం లేదని బీసీ, ఎస్సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ డైరెక్షన్‌లోనే డిసిప్లినరీ కమిటీ కొనసాగుతున్నదని, ఆయన ఎవరిపై చర్యలు తీసుకోమంటే వాళ్లపై యాక్షన్​ తీసుకుంటున్నారని స్వయంగా పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఇది సరైన విధానం కాదని, నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలపై డిసిప్లినరీ కమిటీ నిజాయితీగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని, కానీ కేవలం కులం, వర్గాలు చూస్తూ చర్యలు ఏమిటనీ కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​ ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని బహిరంగసభలో విమర్శించినందుకు అద్దంకి దయాకర్‌కు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ ​నోటీసు ఇచ్చి, సారీ చెప్పించింది. అంతకంటే ముందు ఓ సారి మానవతా రాయ్‌కి కూడా షోకాజ్​నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్నారు. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణను ఏకంగా ఆరు ఏళ్లు పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.

దీంతో పాటు తాజాగా రేవంత్‌పై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నందున బక్క జడ్సన్‌కు షోకాజ్ ​నోటీసులు ఇచ్చారు. కానీ పలు మార్లు పార్టీ లైన్​క్రాస్​ చేసి, మీడియాలో విమర్శలు కురిపించిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తదితర అగ్రకులాలా నేతలపై డిసిప్లినరీ కమిటీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని బీసీ, ఎస్సీ కాంగ్రెస్​ లీడర్లు చెబుతున్నారు. పైగా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న బక్క జడ్సన్‌ను యావరేజ్​ లీడర్ అని స్వయంగా టీపీసీసీ ప్రెసిడెంట్ ​సంభోదించారు. ఇది కూడా క్రమశిక్షణ చర్యలు కిందనే వస్తుంది. కానీ ఆ కమిటీ వర్గాలను చూసి చర్యలు తీసుకుంటున్నదని పార్టీలో వివిధ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story