- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రొటెమ్ స్పీకర్ విషయంలో కాంగ్రెస్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రొటెమ్ స్పీకర్‌గా కాంగ్రెస్ అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం వల్లే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలనుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పూర్తిస్థాయి స్పీకర్ నియామకం తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం, గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు.
ఆపై బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే కాంగ్రెస్, మజ్లిస్ ఒక్కటేనని విషయం బయటపడిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందంతోనే.. సీనియర్ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్.. మజ్లిస్ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్‌గా నియమించిందన్నారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ఎమ్మెల్యేలను నియమించుకునే సంప్రదాయం ఉందని, కానీ.. మజ్లిస్‌తో చేసుకున్న ఒప్పందం మేరకే అక్బరుద్దీన్‌కు అవకాశమిచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు శాసనసభలో మెజార్టీ ఉన్నా.. ఎంఐఎం మద్దతు లేకుంటే తుమ్మినా, దగ్గినా తమ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందేమోనని భయపడి అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు రోజులు కాకముందే.. మజ్లిస్‌తో తన పాత విధానాలను కాంగ్రెస్ మళ్లీ అవలంభిస్తోందన్నారు. కాంగ్రెస్ శాసనసభ గౌరవాన్ని కాలరాసేలా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
అందుకే అసెంబ్లీని బహిష్కరించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో మజ్లిస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారని, ఇప్పుడు కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందన్నారు. రెగ్యులర్స్పీకర్బాధ్యతలు చేపట్టిన తర్వాతనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ నిబంధనలు ఉల్లంఘించి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు మజ్లిస్‌కు ఇవ్వడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు.