బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో మాజీ ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై!

by Ramesh N |
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో మాజీ ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీని వీడి కాంగ్రెస్‌‌లో చేరగా.. తాజాగా మరో మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్లగొండ ఎంపీ టిక్కెట్‌ను తెరా చిన్నప రెడ్డి ఆశించారు. కానీ, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడం.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ దూరంగా ఉండాలని తెరా చిన్నప రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మాజీ ఎమ్మెల్సీ టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. మరోవైపు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా సైదిరెడ్డిని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సైదిరెడ్డికి టికెట్ వద్దని నల్గొండ బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత తెరా చిన్నప రెడ్డి పార్టీలో చేరితే టికెట్ మార్చి ఆయనకు ఇచ్చే చాన్స్‌ ఉందనే వాదన వినిపిస్తోంది.

Advertisement

Next Story