పేలిన మరో ఎలక్ట్రిక్ బైక్

by Y. Venkata Narasimha Reddy |
పేలిన మరో ఎలక్ట్రిక్ బైక్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మంటలు చెలరేగడం సాధరణంగా మారిపోయింది. అయితే ఎప్పుడు ఏ ఎలక్ట్రిక్ బైక్ లు, కార్లు పేలుతాయో తెలియక వాటిని వినియోగిస్తున్న వాహనదారులు నిత్యం ఒకింత ఆందోళన లో గడపాల్సి వస్తుంది. కుత్భుల్లాపూర్ సూరారం చౌరస్తాలో ఓ ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగి.. సమీపంలోని దుకాణానికి వ్యాపించిన ఘటన చోటుచేసుకుంది. ఆదిత్య మెడికల్ షాప్ ముందు నిలిపి ఉంచిన ఎలక్ట్రికల్ బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న మెడికల్ షాప్ కు వ్యాపించాయి. ఆ మెడికల్ షాప్ సైతం పాక్షికంగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటన మరోసారి ఎలక్ట్రిక్ వెహికల్స్ భద్రతా ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయంటున్నారు వాహనదారులు.

Advertisement

Next Story

Most Viewed