- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గొర్రెల స్కీమ్ కుంభకోణం కేసులో మరో BIG ట్వి్స్ట్
దిశ, వెబ్‌డెస్క్: గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ మూడ్రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డుల్లోకి బినామీ ఖాతాల వివరాలు ఎక్కించినట్లు నిర్ధారించారు. మొయినుద్దీన్ నుంచి రూ.లక్షలు తీసుకున్నట్లు గుర్తించడమే కాకుండా.. ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ సిద్ధమైంది.
కాగా, గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితుల కస్టడీ ముగిసింది. వారిని మూడురోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. రెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ ఖాతాలోకి దారి మళ్లించిన దానిపై ఆరా తీశారు. కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.