చంచల్‌గూడ జైల్లో ఉన్న శివబాలకృష్ణకు మరో BIG షాక్

by GSrikanth |
చంచల్‌గూడ జైల్లో ఉన్న శివబాలకృష్ణకు మరో BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో మరో బిగ్ షాక్ తగిలింది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌నను ఏసీబీ కోర్టు మరోసారి కొట్టిపారేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, శివబాలకృష్ణ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఎండీఏలో తొమ్మిదేళ్లుగా కింగ్‌ మేకర్‌గా ఉన్నాడు శివబాలకృష్ణ.

అధికారుల సమాచారం ప్రకారం.. అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండీఏ కమిషనర్‌గా రావడంతో వసూళ్లతో రెచ్చిపోయాడు శివబాలకృష్ణ. హెచ్ఎండీఏలో డబుల్ రోల్-డబుల్ క్యాష్ పద్ధతిలో బిల్డర్లకు, రియల్టర్లకు, ఇన్‌ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అరవింద్ కుమార్‌తో కలిసి డబుల్ డీల్స్ సెట్ చేశాడు. విషయం బయటకు పొక్కడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడు.

Advertisement

Next Story