బీఆర్ఎస్ సభ.. కేరళ CM విషయంలో అనూహ్య పరిణామం!

by GSrikanth |
బీఆర్ఎస్ సభ.. కేరళ CM విషయంలో అనూహ్య పరిణామం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు గులాబీ నేతలు రేపటి ఖమ్మం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ సక్సెస్ చేయడం ద్వారా తమ బలం ఏంటో చాటి చెప్పాలని భావిస్తున్న కేసీఆర్ ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలను ఈ సభకు ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారమే నగరానికి చేరుకుంటారని షెడ్యుల్ ఖరారైంది. అయితే వీరిలో కేరళ సీఎం విజయన్ పర్యటన రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. మంగళవారానికి బదులు ఆయన బుధవారమే రాష్ట్రానికి వస్తారని, రేపు తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఖమ్మం సభకు వస్తారని తెలుస్తోంది.

అక్కడ కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. పినరయి విజయన్ టూర్ విషయంలో మార్పు ఆసక్తిగా మారిది. నిజానికి ఆయన మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకుని నేరుగా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత బుధవారం కేసీఆర్‌తో కలిసి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో యాదాద్రికి బయలుదేరి అక్కడ స్వామి వారి దర్శనం అనంతరం ఖమ్మం సభలో హాజరవుతారని తెలిసింది. కానీ అనూహ్యంగా ఇవాళ రావాల్సిన కేరళ సీఎం రేపు నేరుగా ఖమ్మం సభకే వచ్చేలా టూర్‌లో మార్పులు జరిగాయి. ఈ మార్పు వెనుక తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీల నిర్ణయం ఉందా? లేక ఇతర కారణాలతో ఆయన తన టూర్‌ను రేపటికి వాయిదా వేసుకున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed