Bhatti Vikramarka : భవిష్యత్ తరాలకు అవగాహన సాధనం "బర్డ్స్ ఆఫ్ తెలంగాణ" పాకెట్ గైడ్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Y. Venkata Narasimha Reddy |
Bhatti Vikramarka : భవిష్యత్ తరాలకు అవగాహన సాధనం బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని పక్షుల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) సభ్యులచే అనుసంధానం చేయబడిన "బర్డ్స్ ఆఫ్ తెలంగాణ" పాకెట్ గైడ్(Birds of Telangana Pocket Guide) ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. బుధవారం ప్రజా భవన్ లో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులచే అనుసంధానం చేయబడిన "బర్డ్స్ ఆఫ్ తెలంగాణ" పాకెట్ గైడ్ ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకము ఆవశ్యకతను హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ కోర్ కమిటీ సభ్యులు భట్టికి వివరించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు"బర్డ్స్ ఆఫ్ తెలంగాణ" పాకెట్ గైడ్ ను రూపొందించడానికి వారు చేసిన కృషిని, వారి అవగాహన కార్యక్రమాలను భట్టి అభినందించారు.

హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రెసిడెంట్ ఆడెపు హరికృష్ణ మాట్లాడుతూ "బర్డ్స్ ఆఫ్ తెలంగాణ" పాకెట్ గైడ్ పుస్తకం తెలంగాణ పక్షుల ఆహారం, వలసలు, పరిరక్షణ స్థితి గురించి తెలుసుకోవటానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ పుస్తకం విద్యార్థులు, ప్రకృతి ఔత్సాహికులు, విభిన్న ప్రేక్షకులను ప్రత్యేక జీవ వైవిధ్యంతో కూడుకొన్న తెలంగాణ ప్రకృతితో మమేకం కావటానికి ప్రోత్సహిస్తుందన్నారు. మొత్తం 252 ముఖ్యమైన పక్షి జాతులను కలిగి ఉన్న ఈ పాకెట్ గైడ్ తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా అందించబడుతుందని తెలిపారు. మాజీ డీజీపీ తేజ్ దీప్ కౌర్ మీనన్ మాట్లాడుతూ పక్షుల పరిశీలనను ప్రోత్సహించడంలో హెచ్ బీపీ యొక్క ప్రత్యేక పాత్రను కొనియాడుతూ ఈ బృందం ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ బృందం ఇప్పటివరకు నిర్వహించిన 490+ ఉచిత బర్డ్ వాక్ ల ద్వారా పర్యావరణ పరిరక్షణపై పౌరులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వారు చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని రూపొందించడానికి తమ చిత్రాలను అందించిన 30కి పైగా హెచ్ బీపీ సభ్యులైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ల సహకారం ఎంతో అభినందనీయం అని అన్నారు. ఈ సందర్బంగా యువతలో పక్షుల పరిశీలనను ప్రోత్సహించటానికి, వాటిని సంరక్షించటానికి ప్రభుత్వ మద్దతుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) బృందం కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story