- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటింటికీ తాగునీటికి రూ.44 కోట్లతో అమృత్ జల పథకం : మంత్రి దామోదర
దిశ, సంగారెడ్డి : మహిళలకు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు రూ.44 కోట్లతో అమృత్ జల పథకం ప్రారంభించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో పురపాలక శాఖ ఆద్వర్యంలో పట్టణంలో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయాలనే సంకల్పం తో రూ.44 కోట్ల రూపాయలతో అమృత్ జల పథకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో రూ.కోటి 4 లక్షల రూపాయలతో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని ప్రారంభించారు. అదే విధంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళల చేత నిర్వచించే తొలి పెట్రోల్ పంపు ను రూ.2 కోట్ల ఇండియన్ ఆయిల్ పంపు ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… దేశంలోనే మహిళా సమాఖ్య సభ్యులకు దేశంలోనే రూ.2 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలు చేపట్టినప్పటికీ మహిళల్లో అనుకున్న స్థాయిలో ఆర్థికంగా ఎదగలేకపోతున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు .అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి పథకాన్ని ఏర్పాటు చేసిందన్నారు. పథకం ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహిళ క్యాంటీన్ల ఏర్పాటు ,పెట్రోల్ పంపు ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు లాంటి పథకాలను చేపట్టిందన్నారు. మహిళా శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
మహిళలకు వచ్చే ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు : మెదక్ ఎంపీ రఘునందన్ రావు
స్థానిక సంస్థల్లో ఇప్పటికే మహిళలకు ప్రభుత్వం 50% రిజర్వేషన్ కల్పించిందని రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ రానున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మహిళలు రాజకీయంగా కూడా రాణించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడానికి మహిళలు ఇప్పటి నుండే ముందుకు రావాలన్నారు. మహిళలు ఆత్మ నూన్యతా భావం నుండి బయటపడాలన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
జిల్లాలో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం మహిళా శక్తి పథకంలో పెట్రోల్ పంపు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం మహిళలకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ను పెట్రోల్ పంపులు సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహిళ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు అందుబాటులో ఉండన్నట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసం చేపట్టిన మహిళా శక్తి పథకం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో 108 అంబులెన్స్ లు 11 వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, డీఆర్డీఓ జ్యోతి, ఆర్ డీఓ రవీందర్ రెడ్డి, ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి రామ్ ఇప్పిలి, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచెందర్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. .