Ambedkar University: అంబేద్కర్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు.. నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-30 16:44:03.0  )
Ambedkar University: అంబేద్కర్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు.. నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(Ambedkar University)లో ఏంబీఏ(MBA) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 15వ తేదీ వరకు ఉన్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలు, తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు 7382929570/580, 040-23680222/333/444/555, టోల్‌ఫ్రీ నంబర్ 18005990101 లో సంప్రదించవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సందర్శించాలన్నారు. అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు నవంబర్ 15 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును నిర్ణీత గడువులోపు చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా నవంబర్ 15వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు.

Next Story